రైతులను ఆదుకునేందుకు టీడీపీ ఎల్లవేళలా ముందు ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కృష్ణమ నాయుడు తెలిపారు. జీడీ నెల్లూరులో శనివారం ఆయన మాట్లాడుతూ.. మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు రైతులను ఆదుకునేలా ఆ పార్టీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మామిడికి అదనపు రాయితీ ధర ప్రకటించిందని గుర్తు చేశారు.