కామారెడ్డి పట్టణంలో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఏకలవ్య జయంతి వేడుకలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడారు... ఏకలవ్యుడు చూపించిన విశ్వాసం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు పాల్గొన్నారు.