స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంస్కరణలే నేటికీ కొనసాగుతున్నాయని కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శనివారం దర్శిలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విగ్రహం ఆవిష్కరించిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. రెండు రూపాయలకే కేజీ బియ్యం అందించడం కానీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న ఆలోచన ఆయన నుంచే వచ్చిందని పేర్కొన్నారు.