కామారెడ్డి: పట్టణంలోని త్రిశక్తి మాత ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి పట్టణంలోని త్రిశక్తి మాత ఆలయంలో మంగళవారం దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారి వివిధ రకాలుగా అలంకరించి పూజలు నిర్వహిస్తామని పూజారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.