శ్రీకాకుళం: అంబేద్కర్‌పై అనుచిత వ్యాక్యలు చేసిన హోం మంత్రి అమిత్ షాను బర్తరప్ చేయాలి: KVPS జిల్లా కార్యదర్శి గణేష్
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డా! బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాక్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను బర్త్ రప్ చేయాలని కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి దీర్గాశి గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా గణేష్ మాట్లాడుతూ ఆదునిక మనువాదానికి ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించి, సమ సమాజం వైపు అడుగులు వేద్దామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎంతో గొప్పగా వ్రాసిన మహాను బావుడు అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాక్యలు అన్యాయమని అన్నారు.