అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం నాగలాపురంలో నిన్నటి రోజున కుటుంబ సమస్యలతో బాధపడుతూ పురుగుల మందు తాగిన నవీన్ అనే వ్యక్తి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఏఎంసీ విభాగంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏ ఎం సి విభాగం వైద్యులు డాక్టర్ నూరుల్లా ఖాన్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలిస్తున్నామని వైద్యులు నూరుల్లా ఖాన్ తెలిపారు.