ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని హోటల్లు కిరణా దుకాణాలు కూల్ డ్రింక్ షాపులు గురువారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మద్యం బెల్టు షాపులు అరికట్టే అంశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమంగా మద్యం నిలువ ఉంచడం లేదా మద్యం విక్రయించడం వంటివి చట్టరీత్యా నేరమని అలానే మద్యం తరలించడం కూడా తీవ్ర నేరం అని పోలీసులు దుకాణదారులను వ్యాపారులను హెచ్చరించారు.