యాడికి మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మార్కండేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు గురుమూర్తి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో మార్కండేయ జయంతిని నిర్వహించారు. అభిషేకం, మహన్యాస, గణపతి వంటి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాలలో ఆధ్యాత్మికత వెల్లి విరిసింది.