నేలకొండపల్లి: దసరా సెలవుల్లో ఊరు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి... కూసుమంచి సిఐ సంజీవ్
దసరా సెలవుల నిమిత్తం ఇతర ప్రదేశాలకు వెళ్లే వారికి కూసుమంచి పోలీస్ శాఖ పలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. దసరా సెలవులకు వేరే ప్రాంతాలకు వెళ్లే ఇంటి యజమానులు తమ సమాచారాన్ని పోలీసు వారికి అందజేసినట్లయితే సదరు ఇంటి యజమాని నివసించే ప్రాంతంలో పోలీసు గస్తీని ముమ్మరం చేసి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని సిఐ సంజీవ్ చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగా తమ విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు.