నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని నల్లగట్ల గ్రామ సమీపంలో మంగళవారం ఇండియన్ గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది, ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి, క్షతగాత్రున్ని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది ప్రమాదా స్థలంలో సేఫ్టీ కోన్స్ ఏర్పాటు చేసి భద్రత చర్యలు చేపట్టారు, లారీలో మొత్తము 360 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, సిలిండర్లు పేలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు,ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు