అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో బుధవారం సాయంత్రం వైయస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టామని వైఎస్ఆర్సిపి నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.