అనంతపురం జిల్లా పామిడిలో రోడ్డు దాటుతుండగా బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పామిడి కి చెందిన గజినీ అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో గజినీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గజినీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ సర్వజన తరలించారు. అయ్యప్ప స్వామి గుడి దగ్గర దేవుడు దర్శనం కోసం రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినదని స్థానికులు తెలిపారు.