వైరా: పుణ్యపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
Wyra, Khammam | Mar 11, 2025 మంగళవారం మధ్యాహ్నం సమయంలో వైరా మం. పుణ్యపురం గ్రామం లో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఐదు కోట్ల 35 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.ఒక్కో నియోజకవర్గానికి 3, 500చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే, గిరిజనులు ఎక్కువగా ఉన్న వైరా నియోజకవర్గానికి కోటా కంటే ఎక్కువ ఇండ్లు ఇస్తున్నట్లు మంత్రి అన్నారు.ఈ కార్యక్రమలో వైరా MLA మాలోత్ రాందాస్ నాయక్ ,ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్,ఏసీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.