కొత్తగూడెం: వానలో తడుస్తూ..కాంగ్రెస్ శ్రేణులను కలుస్తూ కొత్తగూడెం పట్టణంలో ఎంపీ రఘురాo రెడ్డి ముమ్మర పర్యటన
వర్షం కురుస్తున్నప్పటికీ.. జల్లుల్లో తడుస్తూనే ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం కొత్తగూడెం పట్టణoలో పర్యటించారు. తనకు భారీ మెజారిటీ తో విజయాన్ని అందించినoదుకు గాను.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తొలుత రామవరంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతుoడగా వాన మొదలవగా.. ఎంపీ తడుస్తూనే ప్రసంగించారు. ఆ తర్వాత రామవరంలోని కాంగ్రెస్ పట్టణ కార్యాలయాన్ని సందర్శించి.. తప్పకుండా ఇక్కడ సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని అభయ మిచ్చారు. అనంతరం గౌతమ్ నగర్, కూలీ లైన్, న్యూ గొల్లగూడెం లలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై.. ఎప్పుడూ అండగా ఉంటానని అభయమిచ్చారు.