రైతులు పంటల సాగు చేసేటప్పుడు యూరియా అధికంగా వాడొద్దని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో శనివారం రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. పంటలు వేశాక అధిక యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి రైతులకు ఎక్కువ ఖర్చు వస్తుందని, యూరియా వాడకం తగ్గించాలన్నారు. రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇందులో ఏవో వినోద్, ఏఈఓ ఉమా పంచాయతీ కార్యదర్శి భూపాల్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.