ఆరోగ్య కేంద్రాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
డి యం హెచ్ ఓ డాక్టర్ .ఈ .బి .దేవి
Anantapur Urban, Anantapur | Nov 15, 2025
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కార్యాలయం ఆవరణం లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ ఈ బి దేవి శనివారం ఉదయం 11 గంటల సమయంలో కార్యాలయ సిబ్బందితో కలిసి కార్యాలయం ఆవరణం ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే ఆసుపత్రి ఆవరణం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని సూచించారు ప్రతి ఒక్కరికి వారు నివసించే ప్రాంతంలో, వారు పనిచేసే ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు.