కళ్యాణదుర్గంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 25న మాఘ మాసాన్ని పురస్కరించుకొని రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించునున్న విషయం తెలిసిందే. రథసప్తమి వేడుకలకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి రథసప్తమి ఆహ్వాన పత్రికలను అందజేశారు. తప్పకుండా వస్తానని ఎమ్మెల్యే చెప్పారని కమిటీ సభ్యులు తెలిపారు. రథసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు.