కాగజ్నగర్: కౌటాలలో భారీ వర్షం, తాటి చెట్టుపై పడిన పిడుగు, భయాందోళనలో గ్రామస్థులు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులలతో కూడిన భారీ వర్షం కురిసింది. దింతో జన జీవనం స్తంభించి.. పలు కాలనీలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల మండలం సాండ్ గాం గ్రామంలో తాటి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడింది.. భారీ వర్షం కురుస్తున్న కూడా చెట్టు పై మంటలు ఎగిసి పడడంతో స్థానికులు భయపడ్డారు.. వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.