అసిఫాబాద్: మత్స్యకారులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం చర్యలు
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
మత్స్యకారులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం ASF మండలం కొమురం భీం ప్రాజెక్టులో మత్స్యకార సంఘ ప్రతినిధులతో కలిసి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధి,సంక్షేమ కోసం అనేక చర్యలు చేపడుతుందని,ఇందులో భాగంగా ప్రాజెక్టులు, చెరువులు,కుంటలలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసి వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మత్స్యకార కుటుంబాలు ఉపాధి పొందాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా అందిస్తుందని, మధ్యాహ్న భోజన పథకం మెనూలో చేపలను చేర్చే అవకాశం ఉన్నందున మరింత ఆదాయాన