పెళ్లి, శుభకార్యాల ఆచార సాంప్రదాయాలలో కంబళి( గొంగడి) ది ప్రత్యేక స్థానం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచార వ్యవహారాల్లోనూ మార్పులు వచ్చి కంబళికి గిరాకీ లేకుండా పోయింది. కంబళి తయారి మీదే ఆధారపడి జీవనం సాగించే వారు రోజంతా కష్టపడితే రూ.300 కూడా గిట్టుబాటు కావడం లేదని గుమ్మగట్టలోని కంబళి తయారీదారులు వాపోయారు. గతంలో చేనేత, ఉన్ని నేత కార్మికులకు 24 వేలు ప్రభుత్వం ఇచ్చేదని కూటమి ప్రభుత్వం వచ్చాక అటువంటి ప్రోత్సాహం లేదని తెలిపారు. కంబళికి మార్కెట్ కల్పించి, తయారీదారులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.