రాజేంద్రనగర్: నగరంలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన మనసురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి
రామోజీరావు పార్థివదేహానికి మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిలిం సిటీ నిర్మించారన్నారు. ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన మహనీయుడన్నారు