ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నీలో మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకొని జీవితంలో పాటు క్రీడల్లో మంచి స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక దృఢత్వానికి క్రీడలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.