పగిడ్యాల హోరా హోరీగా పొట్టేళ్ల పందెం పోటీలు
నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలో శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని పొట్టేళ్ల పందెం పోటీలు నిర్వహించారు, పొట్టేళ్ల పందెం పోటీల్లో పది జతల పొట్టేలు పోటీలో పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు, ఈ పోటీలు ఆదివారం హోరా హోరీగా సాగాయి, పొట్టేళ్ల పందెం పోటీలు తిలకించడానికి పగిడ్యాల మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు, ఈ పందెం పోటీల్లో నంద్యాల జిల్లా పులిమద్దికి చెందిన పొట్టేలు విజయం సాధించి మొదటి బహుమతిని గెల్చుకుంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు