రాయదుర్గం పోలీసు స్టేషన్ లో శుక్రవారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసు స్టేషన్ పరిసరాలు, వివిధ విభాగాలు ఎలా పని చేస్తాయో విద్యార్థినీలకు వివరించారు. సెట్ కాన్ఫరెన్స్ లో ఎలా మాట్లాడాలి, స్టేషన్ లో ఏఏ రికార్డులు ఉంటాయి. ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేస్తారు తదితర అంశాలపై బాలికలకు సిఐ జయనాయక్ అవగాహన కల్పించారు. డయల్ 100, పోలీసు హెల్ఫ్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి పోలీసు సహాయం పొందడం ఎలాగో కూడా తెలిపారు.