అద్దంకికి త్వరలో వస్తా...కలిసి పని చేద్దాం: కార్యకర్తల సమావేశంలో వైసిపి సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్
అద్దంకి కి త్వరలో వస్తానని నూతనంగా నియమించిన వైయస్సార్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ మంగళవారం పల్నాడులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తెలియజేశారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తానని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ రాజ్యసభ సభ్యులు వై.వి సుబ్బారెడ్డి, నందిగం సురేష్, హనిమిరెడ్డిల సహకారంతో పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.