అసిఫాబాద్: అదుపు తప్పితే 60 అడుగుల లోతులోకే, హెచ్చరిక బోర్డులు, రక్షణ గోడలు 6ఏర్పాటు చేయలేదు:CITU మండల కన్వీనర్ ఆనంద్ రావు
కెరమెరి మండలం కోపగూడ సమీపం జోడేఘాట్ కి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ప్రమాదకరంగా 60 అడుగుల లోతైన చెరువు ఉందనీ ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరిని CITU మండల కన్వీనర్ ఆనంద్ రావు అన్నారు. నిత్యం ఈ రహదారిలో వందల సంఖ్యలు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం రక్షణ గోడ కూడా లేదన్నారు. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.