అద్దంకి మండలంలో 25,750 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధం: ఎమ్మార్వో శ్రీ చరణ్
అద్దంకి మండలంలో సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారని ఎమ్మార్వో శ్రీ చరణ్ మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 25,750 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని పాత రేషన్ కార్డుల ప్లేస్ లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారని చెప్పారు.రేషన్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగులు అందజేస్తారని తెలిపారు.