కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి వైసిపి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు సూపర్ సిక్స్ అంటూ ఓదరగొట్టిందని నేడు సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు మా ప్రభుత్వంలో మూడు రోజులు సంక్రాంతి పండగ జరిగితే నేడు సంవత్సరం పాటు జోద క్రీడలు జరుగుతున్నాయి అంటూ విరుచుకుపడ్డారు క్యాష్ ను ఆడాలంటే గోవా శ్రీలంక పోయే పరిస్థితుల నుండి ఆంధ్రప్రదేశ్ లో 365 రోజులు అందుబాటులో ఉండే విధంగా చేశారంటూ విమర్శించారు