కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భువనతేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీపై ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్రీ లాంచ్ పేరుతో 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ లో భువన తేజ పై కేసు నమోదు కాగా, ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. కంపెనీ ఎండి సుబ్రహ్మణ్యం తో పాటు పలువురి ఇళ్లలో వీరి అధికారులు సోదాలు చేశారు. సూరారంలో మార్కెటింగ్ డైరెక్టర్ బీబీ గుప్తా ఇంట్లోనూ ఈడి అధికారులు సోదాలు నిర్వహించారు.