సిర్పూర్ టి: దాహేగం మండల కేంద్రంలో శ్రీ శివ కేశవ ఆలయంలో మంగళవారం మాస శివరాత్రి వేడుకలు
+918688006656 దాహేగం మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవ ఆలయంలో ఈనెల 18న భస్మ హారతి నిర్వహిస్తున్నట్లు వేద పండితులు పరమేశ్ తెలిపారు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో భస్మహారతి నిర్వహిస్తే సకల పాపాలు హరిస్తాయని ఆయన పేర్కొన్నారు. మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ఏ కార్యక్రమం ఉంటుందని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని ఆయన కోరారు,