ధర్మపురి: ధర్మపురిలో గోదావరి నదికి పెరుగుతున్న వరద ప్రవాహం, భారీ వర్షాలతో పెరిగిన నీటిమట్టం
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది వద్ద నీటిప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం బుధవారం స్వల్పంగా పెరిగింది. మొన్నటిదాకా రాళ్లతో దర్శనం ఇచ్చిన గోదావరి.. ఇప్పుడు వరద నీటితో కళకళలాడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకల ద్వారా గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రవాహం క్రమేపి పెరుగుతోంది.