రాయదుర్గం: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన మున్సిపల్ వర్కర్స్
మున్సిపల్ ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాయదుర్గంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ దీక్షల్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్, ఆప్కాస్ విధానం రద్దు, కనీస వేతనం రూ 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.