భైంసా మండలంలోని పుస్పూర్ గ్రామంలో శనివారం రాత్రి పిల్లలంతా కోలాలు చప్పుళ్లతో ఇంటింటికి తిరిగి సందండి చేస్తూ...సరదగా జాజిరి కాముడ ఆడుతూ ధాన్యాన్ని పోగుచేస్తున్నారు.గతంలో ఈ ఆటలు పల్లెల్లో పట్టణాల్లో పదుల సంఖ్యలో పిల్లలు ఒక్కటై అడగా,నేడు ఉరుకుల పరుగుల కాలంలో ఈ ఆటలు ఆడే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాముడు రోజు తో ఈ జాజిరి ఆటలు సమాప్తం అవుతాయి.పిల్లలు సమాజంతో మమేకమై సాంఘిక అభివృద్ధి సాధించటంలో జాజిరి ఆటలు సహాయపడుతాయి...