ఎండాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్ టీ సి బస్సు ద్విచక్ర వాహనాన్ని డీ కొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలేసులు వాహనాలను మళ్లీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.