అసిఫాబాద్: యువజన ఉత్సవాలలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి:జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
యువజన ఉత్సవాలలో జిల్లాలు ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ లో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ యువజన ఉత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లా స్థాయిలో యువజన కళాకారులు, జానపద నృత్యం, జానపద పాటలు, ఉపన్యాస వకృత్వం వంటి ప్రదర్శనల ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా తమలోని ప్రతిభను వెలికి తీయడానికి పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.