ఖమ్మం అర్బన్: గ్రాడ్యుయేషన్ డే పిల్లలకు జీవితంలో ఒక మైలురాయి: ఛైర్ పర్సన్ నిష్ణా శర్మ
గ్రాడ్యుయేషన్ డే అనేది చిన్న పిల్లలకు పాఠశాల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయని శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ అన్నారు.శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ చిన్నారులు తమ ప్రాథమిక దశ విద్యను పూర్తి చేసి, తదుపరి దశకు దాటడం కోసం జరుపుకునే ఈ వేడుక రోజు చాలా జ్ఞాపకశక్తిని కలిగించే క్షణాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారులు జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, లక్ష్య సాధన దిశగా కృషి చేస్తారన్నారు .