కాగజ్నగర్: గిరిజన ఆదివాసి జోగాపూర్ గ్రామాన్ని పర్యటించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్నగర్ మండలంలోని మారుమూల లైన్ గూడ గ్రామ పంచాయతీ జోగాపూర్ ఆదివాసి గ్రామాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గిరిజన గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి రోడ్లు మంజూరు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ఇలాంటి రహదారులపై మారుమూల గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో పట్టణాలకు ఎలా వెళ్లాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.