జూపాడు బంగ్లాలో గ్యాస్ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం, హైవే ధర్నా నిర్వహించిన వినియోగదారులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ కొరతను పరిష్కరించాలని జూపాడు బంగ్లా నేషనల్ హైవే పై శనివారం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ, గ్యాస్ బుక్ చేసి నెల రోజులైనా ఇంతవరకు సిలిండర్ పంపిణీ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు, కలెక్టర్ గ్యాస్ కొరత లేదని ప్రకటించిన గ్యాస్ మాత్రం సప్లై చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.