పామూరు పట్టణంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ ఆటల పోటీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాంప్రదాయ ఆటల పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాగే ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా సాంప్రదాయ క్రీడలను నిర్వహించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.