అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా ఎర్నాల కొట్టాలకు చెందిన సికిందర్ అనే వ్యక్తికి కారు ఢీకొనడంతో కాలు విరగిపోవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సికిందర్ ను ఆర్తో వార్డుకు తరలిస్తున్నామని అత్యవసరభాగం వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.