సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్
సత్య సాయి బాబా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు చేసి ప్రజలలో దేవుడయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం పుట్టపర్తిలోని సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బాబా ఉచిత విద్య, వైద్యం అందివ్వడమే కాకుండా తాగునీరు అందివ్వడం గొప్ప విషయం అన్నారు. ఆయన తెలంగాణలోని కొడంగల్కు తాగునీరు, తమిళనాడులో కూడా సేవలందించారని గుర్తు చేశారు.