జిహెచ్ఎంసి విలీనంలో భాగంగా కొత్తగా చర్లపల్లి వార్డును రెండు భాగాలుగా విభజించి 16వ వార్డుగా చక్రిపురంను ప్రకటించారు. చక్రిపురం, మారుతి, టీచర్స్, సోనియాగాంధీ, మీనాక్షి, లక్ష్మీ నరసింహ కాలనీలో ప్రజలు ఈ విషయాన్ని ఉల్లాసంగా స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, మున్సిపల్ కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపి, బాణసంచ కాల్చి, సంబరాలు జరుపుకున్నారు.