పెద్దపప్పూరు మండలం అశ్వర్థ క్షేత్రంలో సోమవారం అశ్వర్ధ నారాయణస్వామి తిరుణాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి నాలుగు వారాలపాటు తిరణాల ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ ఈవో సుబ్రమణ్యం చెప్పారు. భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.