ఇబ్రహీంపట్నం విటిపిఎస్ బూడిద సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం లోని వీటీపీఎస్ నుండి వచ్చే బూడిద కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం ఉదయం 12:30 గంటల సమయంలో అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటి పిఎస్ నుంచి వచ్చే టన్నుల కొద్ది బూడిద వలన ఆ ప్రాంతం కాలుష్యంతో నిండిపోతోందని పర్యవసానంగా ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.