నెల్లిమర్ల: నెల్లిమర్లలో కోలాహలంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్
వైఎస్సార్సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం కోలాహలంగా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి మండుటెండను లెక్కచేయకుండా వేలాది సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, వైసీపీ పూసపాటిరేగ మండల శాఖ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, వైసిపి జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, బడ్డుకొండ కుటుంబ సభ్యులు మణిదీప్, ప్రదీప్, సిరి సహస్రతో కలిసి తన నామినేషన్ పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం నూకరాజుకు బడ్డుకొండ అందజేశారు.