విజయనగరం: రాజాం నవదుర్గ అమ్మవారి దేవాలయంలో నాగుపాము హల్చల్ చేయడంతో చాక చక్యంగా బందించిన స్నేక్ క్యాచర్
విజయనగరం జిల్లా రాజాం నవదుర్గ అమ్మవారి దేవాలయంలో మంగళవారం నాగుపాము హల్చల్ చేసినట్లు ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ తెలియజేశారు. ఉదయం 5 గంటలకు దేవాలయం తెరిచి చూడగా నాగుపాము ఉండడం గమనించారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో ఆయన వచ్చి పామును పట్టుకున్నారు. దానిని గ్రామానికి దూరంగా చెరువు వద్ద విడిచిపెట్టారు. గత ఏడాది భవాని దీక్ష సమయంలో నాగుపాము వచ్చినట్లు ధర్మకర్త నర్సింగ రావు చెప్పారు.