తిర్యాణి మండలంలో పీఎంజుగా, పీఎం జన్మన్ పథకలపై కళాజాత ప్రదర్శనను శనివారం సాయంత్రం డిటిడిఓ రమదేవి ప్రారంభించారు. తిర్యాణి మండలంలోని దంతాన్ పల్లి, సుంగపూర్, లక్ష్మిపూర్, గ్రామాలలో కళాకారులచే ప్రదర్శనను చేపట్టి ప్రజలకు పీఎంజుగా,పీఎం జన్మన్ పథకాలపై అవగాహన కల్పించారు. దంతాన్ పల్లి గ్రామంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన గంగారం గుస్సాడి బృందంతో అక్కడి ఉన్న ప్రజలకు ఈ పథకాలపై అవగాహన కల్పించారు. సందర్భంగా డి టి డి ఓ రమాదేవి మాట్లాడుతూ. గిరిజనులకు వరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు.