కామేపల్లి: కామేపల్లి, జూలూరుపాడు మండలాల్లో ఘనంగా మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి
జూలూరుపాడు కామేపల్లి మండలాల్లో అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఆర్ అంబేద్కర్ విజయం వెనుక రమాబాయి పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కుమారుని ఆరోగ్యం బాగాలేని సమయంలోనూ అంబేద్కర్ చదువులకు డబ్బులు అవసరం ఉంటే పంపించి, చదువులు కొనసాగించేలా చొరవచూపిన గొప్ప త్యాగశీలి అని పేర్కొన్నారు.