రాజేంద్రనగర్: షాద్నగర్ పరిధిలోకొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయవాదులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏపీ సురేష్
వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై న్యాయవాదులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది, పలు గ్రంథాల రచయిత, న్యాయ శాస్త్ర నిపుణులు ఏపీ సురేష్ సూచించారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన చట్టాలపై అవగాహన సదస్సుకు షాద్ నగర్ సీనియర్ సివిల్ జడ్జ్ సీహెచ్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు