కళ్యాణదుర్గంలో శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గరికపాటిని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు గరికపాటి నరసింహారావుకు పాదాభివందనం చేశారు. గరికపాటి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు కుటుంబ సభ్యులకు కూడా పాదాభివందనం చేశారు.